Posts

Showing posts from 2019

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్

Image
యుద్ధ విమానం తేజాస్‌లో రక్షణ మంత్రి   రాజ్‌నాథ్‌ సింగ్‌   గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో పైలట్‌ వెనుక సీటులో కూర్చున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ హెల్మెట్‌ ధరించి, ఆక్సిజన్‌ మాస్క్‌తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్‌లోని హాల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్‌ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్‌లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా  ఉన్నానని రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. తేజాస్‌ యుద్ధ విమానంలో పర్యటించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌ పేరిట రికార్డ్‌ నమోదైంది.పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో విహారం ఆస్వాదించానని, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్‌ కొనుగోలుకు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. కాగా ఈ ఏడాది జనవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సుఖోయ్‌ 30 యుద్ధ విమానంలో జోథ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేఫన్‌ సుంచి 45 నిమిషాల పాటు ప్రయాణించారు.

ఆ విషయంలో మనోళ్లే ముందు

Image
దేశం వలసబాట పడుతోంది. బతుకుదెరువుకోసమో, చదువుకోసమో, ఉపాధి కోసమో కారణమేదైనా కావచ్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్‌ మైగ్రెంట్‌ స్టాక్‌ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలను ఈ రిపోర్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్‌ టెన్‌ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. 1.75 కోట్లమంది మన దేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో అగ్రభాగాన ఉంటే మెక్సికో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ♦  2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చి

భారీ పెనాల్టీల పై నిరసన

Image
రేపల్లె :ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు వడ్డిస్తూ మోటార్‌ వాహన చట్టంలో చేపట్టిన సవరణలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో పలు ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు గురువారం సమ్మెకు పిలుపుఇచ్చాయి. రవాణా సమ్మెతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌ల సేవలు నిలిచిపోవడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ట్రక్కులు, బస్‌లు, ఆటోలు, టెంపోలు, మ్యాక్సి క్యాబ్స్‌ సహా అన్ని వాహనాలకు సంబంధించిన 41 సంస్థలు, సంఘాలతో కూడిన రవాణా సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌టీఏ) సమ్మెకు పిలుపు ఇచ్చింది. మోటార్‌ వాహన చట్టానికి చేసిన సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని, ప్రైవేట్‌ వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి.

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

Image
  రేపల్లె మండలం. సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ సిపిఎం రేపల్లె డివిజన్ కమిటీ సభ్యులు కె. శరత్ అధ్యక్షతన జరిగింది.కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ ప్రారంభంలో దివి.సాయిబాబు చిత్రపటానికి సీపీఎం సీనియర్ నాయకులు ఏవిపికె.సుబ్రమణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ కామ్రేడ్ దివి. సాయిబాబు రేపల్లె ప్రాతంలో కార్మిక,వ్యవసాయకార్మిక,రైతు,చేనేత కార్మికులు ఉద్యమాల్లో పనిచేసినా వ్యక్తి అన్నారు.అనేక ప్రజా సమస్యలపై ప్రజల్లో పనిచేసినా ఉద్యమా నేత అన్నారు.సాయి బాబు ఆనారోగ్యం ఉన్నపటికీ ప్రజల్లో ఉండి చివరి వరకు ఎర్రజండాని విడవని ఆదర్శప్రాయడు,సాయిబాబు గారు చిన్న వయసులో ఆకాలంగా చనిపోవటం రేపల్లె ప్రాంత  ఉద్యమాన్నికి లోటు అన్నారు.నేడు దేశంలో బీజేపీ పెద్ద ఎత్తున కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ కష్టజీవులుకి నష్టం కలిగించే విధనాలును ముందుకు తెస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా లాంటి విషయాలు పక్కనపెట్టి ఉన్న ఉద్యోగాలు తీసివేస్తూ కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు,రాబోయే కాలంలో ఐక్య పోరాటాలు కేంద్ర,ర

అహమదీయఎడ్యుకేషనల్ అకాడమి

Image
డైరెక్ట్ గా 10 వ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ పొందవచ్చును 2 సంవత్సరముల ఇన్టర్మేడియేట్ సర్టిఫికేట్ 1 సంవత్సరం లో పొందవచ్చును  I T I  రెగ్యులర్ కోర్సు  కలదు . T T C , B E D, H P T   , ట్రైనింగ్ కోర్సులకు సంప్రదించవలెను . ప్రతి సంవత్సరము నాగార్జున  యూనివర్సిటి   మరియు ఆంద్ర  యూనివర్సిటి      U G, P G కోర్సులు కలవు . ఇతర రాష్ట్రాల సర్టిఫికే్ట్స్ టెక్నికల్, డిప్లమా కోర్సులు, రెగ్యులర్  ఆల్ బ్రాంచెస్  హిమాలయన్ యూనివర్సిటి సన్ రైజ్ యూనివర్సిటి మేవార్ యూనివర్సిటి I E C యూనివర్సిటి విలియమ్ క్యారి యూనివర్సిటి N E F T యూనివర్సిటి పాస్ గ్యారెంటి 8297449394

వంట సామాగ్రిని వరద బాధితులకు అందించిన అనగాని

Image
గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో వరద బాధితులను పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు,వంట సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు అనగాని మాట్లాడుతూ రాజకీయ లబ్దిపొందాలని కక్షతో వరద చుట్టూతా చూపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వరద ముంపు తేవాలని చూశారు ఈ వరద మనిషి క్రియేటెడ్ వరదని అన్నారు ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం తెలియని ఇరిగేషన్ మంత్రి యొక్క  పర్యవేక్షణలో పై నుండి వరద ప్రాపర్ అంచనా వేయలేక కిందకి ఎప్పుడెప్పుడు విడతలవారీగా వధలాలో అది కూడా తెలియకుండా పరివేక్షించకుండా ఉండడం వల్లనే ఈ వరద రావడం జరిగింది చంద్రబాబు గారి ఇల్లు కుల కొట్టడం కోసం దురాలోచనతో వరద క్రియేట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటిని ఆపటం చాలా దుర్మార్గ చర్య ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి గ్రామాలన్నీ ముంపు గురవుతుంటే వేల ఎకరాలు పంట నష్టం జరుగుతుంది కుటుంబంతో ముఖ్యమంత్రి గారు అమెరికా విహారయాత్ర వెళ్లడం చాలా బాధాకరం అనిపిస్తుంది గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తం చేశారు కృష్ణా నదిలో

అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల

Image
అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని అమరావతికి తరలించే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను లారీల్లో తరలించారు. ఆసమయంలో కొన్ని లారీలను నేరుగా అప్పటి స్పీకర్ కోడెల తన ఇంటికి మళ్లించారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన నివాసంలో కంప్యూటర్లు, విలువైన ఫర్నిచర్‌ ఉంచుకున్నారు.ప్రభుత్వం మారినా సరే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కోడెల మౌనంగా ఉంటూ వచ్చారు.ఇటీవల అసెంబ్లీ అధికారులు హైదరాబాద్‌ నుంచి వచ్చిన కంప్యూటర్లు, ఫర్నిచర్‌ గురించి పరిశీలన చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.తరలింపు సమయంలో స్పీకర్ కోడెల నేరుగా తన ఇంటికి లారీలను మళ్లించారని కొందరు ఉప్పందించారు. తొలుత ఈ విషయంపై అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాసినా కోడెల స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి పరిశీలించగా ఫర్నిచర్, కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది. దాంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

కోర్రాలతో అద్భుతమైన లాభాలు

Image
యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి జీర్ణనాలన్ని శుభ్రం చేస్తుంది శరీర బరువును పెరగనివ్వదు మన దేశ ప్రజలు కొర్ర బియ్యాన్ని తక్కువగా పండిస్తారు. భారత ప్రజలు కొర్రలను చిరుధాన్యాలుగా పిలుస్తారు. కొర్రలను పండిస్తున్న  రైతులు  భారతదేశంలో  చాలా తక్కువగా ఉన్నారు.  బియ్యాన్ని వండుకొన్నట్టే కొర్రలను కూడా వండుకోవచ్చు. కొర్ర బియ్యం తో కొర్ర అన్నం ,  కొర్ర పులిహోర, కొర్ర కిచిడి, కొర్ర ఉప్మా, కొర్ర అంబలి, కొర్ర రొట్టెలు వంటి వివిధ రకాల వంటలు వండుకొని తినవచ్చు.షుగర్ సమస్య  ఉన్నవారికి కొర్రలు దివ్య ఔషదం అని చెప్పవచ్చు.  ఇవి అధిక శక్తిని అధిక పీచు పదార్ధాన్ని కలిగి ఉంటాయి. కొర్రలలో మాంసకృత్తులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం మరియు రెబోఫ్లోమింగ్ అధికంగా ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తాయి. కొర్ర బియ్యం జీర్ణనాలన్ని శుభ్రం చేస్తుంది మరియు మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. శరీర బరువును పెరగనివ్వదు. కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. కడుపునొప్పి, ఆకలి లేకపోవటం అజీర్తి వంటి సమస్యలకు ఇవి చాల

మృతి చెందినా మత్స్యకార్మికుడికి కుంటబాని అదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ డిమాండ్

Image
భ్రటిప్రోలు మండలం వార్త..ఒల్లేరు గ్రామం మృతి చెందినా  మత్స్యకార్మికుడికి కుంటబాని అదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు టి.కృష్ణమోహన్ డిమాండ్ చసారు...తహశీల్దార్ బి.శ్రావణ్ కుమార్  కి వినతిపత్రం అందించారు.. భ్రటిప్రోలు మండలం పరిధిలో వరదసేవలో మృతి చెందినా మత్స్య కార్మికుడి కుటంబానికి 25 లక్షలు ఎక్సగ్రేషియా,ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని  ఒల్లేరు గ్రామలో  అత్యక్రియలు వద్ద గ్రామ ప్రజలు సమక్షంలో తహశీల్దార్ గారికి  వినతిపత్రం ఇవ్వటం జరిగింది.పెద్ద పులివర్రు పెసరలంక గ్రామాల మధ్యలో పడవ వర్కర్ వరదసహాయ చర్యలు కోసం ప్రభుత్వం క్రింద నియంచకోబడినా  మత్స్యకార్మికుడు వల్లభనేని వెంకటరాజు రెండు రోజులు క్రితం గల్లంతు అయ్యి మృతి చెందాడు.కానీ నేటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు అతని కుటుంబనికి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ అధికారులుని నిలదీస్తామని టి.కృష్ణమోహన్ అన్నారు.సీపీఎం నేతలు నష్టపరిహారం ఇవ్వకుండా ఇప్పటి వరకు జాప్యం చేయటం ఏంటి అని తహశీల్దార్ గారితో వాగ్విదానికి దిగే క్రమంలో తహసీల్దార్ స్పందిస్తూ మంత్రిగారు, శాసనసభ్యులు,జిల్లా కలెక్టర్ గారి దృష్టికి సమస్య వారి దృష్ఠికి తీసికువెల్లతాను ఈరోజు సా

భారత విద్యార్థి ఫెడరేషన్ SFI

Image
స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగించాలని సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 21 ఛలో కలెక్టరేట్ విద్యార్థులు కదలిరండి!   ఛలో కలెక్టరేట్ జయప్రదం కొరకు స్థానిక ABR ప్రభుత్వ కాలేజ్ ఆవరణలో SFI నాయకులు ఛలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు  ఈ సందర్భంగా SFI డివిజన్ కార్యదర్శి బి.ఆర్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిపోయింది.గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల సమస్యల మధ్య విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిపై అధికారులకు మంత్రులకు, mla లకు , వినతి పత్రాలు అందించాము   ధర్నాలు నిర్వహించాము . అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. అందువల్ల  రేపల్లె నియోజకవర్గ పరిధిలోని  విద్యార్థులు సమస్య పరిష్కారం కోసం ఈనెల 21వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి విద్యార్థిని,విద్యార్థులు తరలిరావాలి మన సమస్యలు పరిష్కారం కోసం జరిగే ధర్నా లో పాల్గొనాలని కోరుతున్నాము. | దేశం, రాష్ట

ఆర్ ఆర్ ఆర్ కి నేషనల్ మార్కెట్ లో పోటీ

Image
2020 జూలై 30 రిలీజ్ డేట్ ఏడాది ముందే బుక్ చేసుకున్న  క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా బాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా వాళ్ళ సినిమాలను  ఒక రోజు అటుఇటుగా విడుదల చేసుకునేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న పోలీసు కథ సూర్యవంశీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి జులై 30నే విడుదల తేది ఖరారు చేశారు. అదే రోజు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3, ఇన్షఅల్లా  రావొచ్చని ముంబై రిపోర్ట్స్ ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ కు నేషనల్ మార్కెట్ లో హిందీ సినిమాలతో భారీ పోటీ తప్పేలా లేదు. షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నా రాజమౌళి మాత్రం డేట్ విషయంలో ఎలాంటి మార్పు చేయడం లేదు. అక్కడ చూస్తేనేమో ఒకరిని మించి మరొకరు అదే తేదీ కోసం పోటీ పడుతున్నారు. ఇదే పరిస్థితి ఆగస్ట్ 15 అనుకున్నప్పుడు సాహోకు వచ్చింది. .

ఇళ్ల స్థలాలు కోసం ధర్నా...

Image
  చేరుకుపల్లి ..ఇళ్ల స్థలాలు కోసం ధర్నా...వ్యవసాయ కార్మిక సంఘము మరియు సీపీఎం ఆధ్వర్యంలో చేరుకపల్లి తహసీల్దార్ కార్యాలయ వద్ద ధర్నా నిర్వహించి,తహసీల్దార్ శ్రీదేవి గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ ధర్నాలో సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు అనేక మంది ఇళ్లస్థలాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇస్తాముంటున్నారు కానీ ఇప్పటికే ప్రభుత్వ స్థలలో ఇళ్ళు వేసుకొని ఉంటున్నావారికి పట్టాలు ఇవ్వాలి.మరియు చేరుకుపల్లి మండలం పరిధిలో జాతీయ రహదారి నిర్మాణం పరిధిలో ఇళ్ళు కోల్పోయిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి అన్నారు.మరియు రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కార్మికులులకి రాష్ట్రంలో మిగులు భూములు ఉన్నప్పటికీ సాగుభూములు  ఇవ్వటం లేదు కనీసం ఇళ్ల స్థలాలు అయనా రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ కార్మికుడుకి ఇవ్వాలని అన్నారు.ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కమిటీ సభ్యులు విష్ణువర్ధనరెడ్డి,సీపీఎం చేరుకుపల్లి మండల కార్యదర్శి కె.శరత్, మహిళ సంఘము ఐద్వా రేపల్లె డివిజన్ అధ్యక్షురాలు పి.వీణదేవి,సీపీఎం నాయకులు వి.మావో మరియు మ

ముంపు ప్రాంతం లోని వ్యక్తిని కాపాడిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు

ముంపు ప్రాంతం లోని వ్యక్తిని కాపాడిన రేపల్లె రూరల్ సిఐ శ్రీనివాసరావు.వెంటనే తమ వాహనంలో ఆసుపత్రికి  తీసుకువెళ్లి దగ్గరుండి వైద్యం చేయించిన సిఐ శ్రీనివాసరావు పట్ల ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలం ఓలేరు పంచాయతీ పల్లెపాలెం గ్రామంలో వరదకి మునిగిపోయి ఉండటం తెలిసిందే ఆ గ్రామంలోని కుటుంబాలు కరకట్ట మీద గూడరాలు వేసుకొని నివాసముంటున్నారు. ముంపు గ్రామాల్ని పర్యవేక్షించి  క్రమంలో రేపల్లె రూరల్ సీఐ శ్రీనివాస రావు పల్లెపాలెం గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడే క్రమంలో నాగిడి ధర్మయ్య  ఒక్కసారిగా తన బావ చనిపోయిన బాధలో అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో గ్రామస్తులందరూ విలవిలలాడిపోతూ ఏమైందో తెలియని పరిస్థితుల్లో వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేశారు ఇది తెలుసుకున్న సిఐ శ్రీనివాసరావు  వెంటనే తన  వాహనంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తీసుకుని రావడంతో  ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.

గ్రామ సచివాలయం ఉద్యోగ అభ్యర్థులుకు నమూనా పరీక్ష

Image
ప్రశ్నా పత్రంతో సీపీఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పరీక్ష రాస్తన్న అభ్యర్ధులు   రేపల్లె పట్టణంలో   కోస్టల్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం ఉద్యోగ అభ్యర్థులుకు నమూనా పరీక్ష....రేపల్లె విశాఖ కాలేజీలో  నిర్వహించిన ఈ నమూనా పరీక్ష పేపర్లను ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్.మణిలాల్,కోస్టల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కే.అర్జునరావు,ఎస్ఎఫ్ఐ రేపల్లె డివిజన్ కార్యదర్శి బి.ఆర్య  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్. మణిలాల్  మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో  నిరుద్యోగులలకు గ్రామ సచివాలయం ఉద్యోగలు నోటిఫికేషన్ విడుదల చేయటం హర్షణీయం.రేపల్లె పట్టణంలో తీరప్రాంత నిరుద్యోగులు కోసం కోస్టల్ కోచింగ్ సెంటర్ నమూనా పరీక్ష నిర్వహించటం అభినందనీయం.గ్రామ సచివాలయం పోస్టుల్లో ఎటువంటి ఆవకతవకలు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.కోస్టల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ కె. అర్జనరావు మాట్లాడుతూ 50 మంది నిరుద్యోగులు ఈ నమూనా పరీక్షను ఉపయోగించుకొన్నారు.ఈ నమూనా పరీక్షల్లో పాల్గొన్నవారు ఇంకా కష్టపడి చదివి ఉద్యోగాలు సాదించలాన్నారు.

ఆర్టికల్ 370,35ఏ రద్దు పై చర్చగోష్ఠి

Image
చర్చగోష్ఠిలో ప్రసంగిస్తున్న నేతలు  పట్టణంలో ...జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370,35ఏ రద్దు అంశంపై  సీతారామయ్య కల్యాణ మండపంలో జరిగింది.ఓపిడీఆర్(ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ)ఆధ్వర్యంలో ఓపిడీఆర్ నాయకులు నాగరాజు గారు అధ్యక్షతన జరిగింది.ఈ చర్చ గోష్ఠిలో తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రల ఓపిడీఆర్ ప్రధాన కార్యదర్శి వి.హనుమంతురావు గారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై నిరంకుశమంగా బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుంది.జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కల్పించే  స్వయంప్రతిప్తతిని రద్దు చేస్తు  ఉగ్రవాదని నిర్ములిస్తాము,జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి 370 ఆర్టికల్ ఆటంకంగా ఉందని ప్రచారం చేస్తున్నారు.కానీ దానిలో వాస్తవం లేదు 1947  స్వాతంత్ర్య అనతరం నుండి 370 అమలు జరుగుతుంది కానీ నేడు ఈ 370 ఆర్టికల్ రద్దుచేస్తు కాశ్మీర్ ని భారత దేశంలో విలీనం చేశాము అభిరుద్ది చేస్తాము అనటం ప్రజలను తప్పుదోవ పట్టించటమే అని వామపక్ష శక్తులు అభ్యదయ శక్తులుగా,ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపిడీఆర్ ఖండిస్తున్నాము అని అన్నారు.వాస్తవానికి హిందూత్వ ఏజండాతో లోకిక భారత దేశంలో హక్కులు పై దాడి మరియు జమ్మూకాశ్మీర్ లోకి కార్పొరేట్ సంస్థలు ప

లోతట్టు ప్రాంతాలు మంత్రి పర్యటన

Image
రేపల్లె  మండలం పెనుముడి మోర్తోట  లంకెవనిదిబ్బ , పెనుమూడి, లంక గ్రామాలకు వరద ముంపుకు గురైన   గ్రామాలను పరిశీలించిన రాష్ట్ర  పశు సంవర్ధక మార్కెటింకి శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు  .

పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు

Image
పెనుమూడి ఘాట్ వద్ద  వరద నీరు వచ్చిన ఆంజనేయ స్వామి గుడి పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు  రేపల్లె మండలంలోని పల్లిపాలెం గ్రామం చుట్టూత వరద నీరు చేరుంది. దీంతో గ్రామంలోని లోతట్టు  ప్రాంతం లోని ఇళ్ళు  మునిగిపోయాయి. అప్రమత్తమైన అధికారులు, స్థానికులను పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు క్రమంగా పెరుగుతుండడంతో తీరప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. వరద ముంపు గ్రామాలలో అన్నీ సహాయ చర్యల చేపడుతున్నారు.  పునరావాస కేంద్రాలలో వరద బాధితులకు భోజన వసతి, వైద్య వసతి కల్పిస్తున్నారు.

వనం మనం కార్యక్రమంలో మంత్రి మోపిదేవి

Image
రేపల్లె మండలం అర్వపల్లి రోడ్డు లో  వనం-మనం   పర్యరక్షణలో భాగంగా  రాష్ట్ర పశుసంవర్దక, మార్కెటింగ్ ,మత్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు  చేతులు మీదగా మొక్కలు నాటుట కార్యక్రమం విజయవంతం గ జరిగినది.ఈ కార్యక్రమానికి పట్టణ వై ఎస్ ఆర్ సీ పీ పట్టణ అధ్యక్షులు గడ్డం రాధ కృష్ణ , కె వీరబ్రమ్మెంద్ర స్వామి , చీమటం బాలాజీ, చిత్రాల ఒబెదు, పట్టణ కమిషనర్,తదితరులు పాల్గొన్నారు.

మదర్సాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు

Image
మదర్సాలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు రేపల్లె పట్టణంలోని 26వ వార్డులో గల మదర్సా ఎ సుల్తానియా ఫైజాన్ ఎ గౌసె ఆజంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రేపల్లె పట్టణ సిఐ ఎస్ సాంబశివరావు, పట్టణ ఎస్ఐ ఎంవి చరణ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ మదర్సాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరం అన్నారు. జండా వందనానికి తనను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పిల్లల్లో బాల్యం నుంచే దేశభక్తిని పెంపొందించాలని చెప్పారు. మదర్సా అభివృద్ధి కి తన వంతు సహాయ సహకారాన్ని అందిస్తానని చెప్పారు.అనంతరం పట్టణ సిఐ. ఎస్ఐ లు హజరత్ సయ్యద్ సుల్తాన్ షా ఖాదరీ హనఫీ సూఫీ ఔలియా దర్గాను దర్శించుకున్నారు. దర్గా నిర్వాహకులు వారికి సంప్రదాయ తలపాగా అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మదర్సా ప్రిన్సిపాల్  హఫీజ్ మహ్మద్ సయీద్ అన్వర్, జామియాపెద్ద మసీదు కమిటీ అధ్యక్షులు షేక్ జీలాని , ముస్లిం పెద్దలు షేక్ మస్తాన్, సుభాన్ , ఇబ్రహీం , షేక్ జాఫర్ సాదిక్ , ఖలీల్ , హుస్సేనా , సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ళు కాలిపోయిన వారికి ఆర్ధిక సాయం

Image
కాలిపోయీనా ఎల్లను పరిశీలిస్తున్న ఎం ఎల్ ఏ   ఆర్ధిక సయం చేస్తున్న ఎం ఎల్ ఏ రేపల్లె మండలం రావిఅనంతరం గ్రామంలో   మంగళవారం ఉదయాన్నే 2  నుంచి 3  సమయంలో      ప్రమాదశాత్తు ఇళ్ళు కాలిపోయిన వారిని పరామర్శించి ఆర్ధిక సాయం అందచేసిన మన శాసన సభ్యు లు శ్రీ అనగాని సత్యప్రసాద్.అనంతరం రేపల్లె మండలం పెనుమూడి లో వరద ఉద్రితను పరిసిలించారు. వరద ఉద్రుతను పరిశీలిస్తున్న ఎం ఎల్ ఏ

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Image
రేపు ఆగష్టు 15  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్బముగా  ఉదయం 10.00  గంటల కు    మన రేపల్లె  వై యస్ అర్ కాంగ్రెస్ పార్టి  ఆఫిస్ లో  జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం జరుగుచున్నది .కావున వై యస్ అర్ సీపీ నాయకులు,కార్యకర్తలు అందరు అధిక సంఖ్యలో  ఈ వేడుకలు లోపాల్గొని విజయవంతముచెయవలసినదిగ కొరుకుంటూ.. మీ గడ్డం కృష్ణ  పట్టణ వై యస్ అర్ సీపీ అద్యక్షులు ,రేపల్లె  

ప్రవాహం పెరిగిన వరద నీరు

Image
రేపల్లె మండలం పెనుమూడి ఘాట్ వద్ద వరద నీరు కృష్ణా నది పరివాహ ప్రాంతాలైన  కొల్లూరు ,కొల్లిపర ,భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో ఇరవై ఒక్క గ్రామాల్లో వరదనీరు వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తమైన అధికారులు. పదకొండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిహెచ్చరించిన రెవెన్యూ డివిజనల్ అధికారి .పెనుముడి, ఓలేరు ఘాట్ వద్ద వరద నీరు ప్రవాహం ఎక్కువగా వస్తున్నది. ఓలేరు ఘాట్ వద్ద సగానికి మునిగిన కరెంటు స్తంభం

బాధితులను పరామర్శించారు

Image
చేరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య , పశుసంవర్ధక , మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు   సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ మోపిదేవి హరనాద్ బాబు గారు   వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు"

Image
CITU నేతలు రేపల్లె టౌన్. .సీఐటీయూ ఆగస్ట్ 18 గుంటూరులో జరిగే "కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు" జయప్రదం చేయాలని కోరుతూ రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మిట్ చేస్తామని అధికారంలోకి వచ్చినా అని ప్రభుత్వాలు హామీలు ఇస్తూ వస్తున్నాయి.ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తుదంని ఎన్నో ఆశలతో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.కానీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయకుండా కేవలం ప్రభుత్వం కమిటీ వేసి కాలయాపన చేస్తున్నది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న విద్య,వైద్యం,ఆర్టిసి,అగ్రికల్చర్,డేటా ఆపరేటర్లు,విద్యుత్ తదితర కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులును పర్మినెట్ చేయాలని మరియు  సచివాలయం ఉద్యోగాల భర్తీలో గతంనుండి పనిచేస్తున్నా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 18న గుంటూరులో జరిగే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్య

ఇసుక క్వారీ లను తెరిపించాలి

Image
రేపల్లె నియోజక వర్గం భవన నిర్మాణ కార్మికుల సంఘం AITUC ఆధ్వర్యంలో పెనుముడి, ఓలేరు ,జువ్వాలపాలెము, మరియు రాష్ట్ర వ్యాపితం గా ఉన్న ఇసుక క్వారీ లను తెరిపించి కార్మికులకు ఉపాధి చూపించాలని పట్టణ వీధులలో భారీ ప్రదర్శన నిర్వహించి MRO గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AITUC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.వెలుగూరి రాధాకృష్ణ మూర్తి గారు ధర్నా ను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ఈ నెల 25,26 తేదీల లో విజయవాడలో జాతీయ సెమినార్ లో దేశవ్యాప్తం గా ఇసుక పాలసి ని రూపొందిచాలని,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ పరిరక్షణ, కార్మికుల భద్రత గురించి చర్చించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి P..సత్యనారాయణ,AITUC జిల్లా అధ్యక్షుడు P. నాగాజనేయులు,ఏరియా కార్యదర్శి.K.రమేష్, G. శివయ్య, శ్రీనివాసరావు,P. వెంకటేశ్వరరావు, పఠాన్ గౌస్,Cpi ఏరియా కార్యదర్శి G. బాలజీ,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ D. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

పందులను వీధుల్లో వదలరాదు

Image
కమీషనర్  బి విజయ సారధి రేపల్లె పట్టణం లోని పందుల పెంపకదారులతో కమీషనర్  బి విజయ సారధి ఛాంబర్ నందు జరిగిన సమావేశంలో పందులను పట్టణ విధులలో వదలకుండ వుండవలనని తెలియచేయగా పెంపకదారులు అది మా జీవన ఆధారం కావున మాకు పందులను పెంచుకొనుటకు ప్రదేశము ఏర్పాటు చేయవలసిందిగా కోరగా కమీషనర్ గారు త్వరలో వారి సమస్యలను పరిష్కరంచే చర్యలు తీసికొనబడునని తెలియచేయగా పందుల పెంపకదారులు రేపటి నుండి పుర విధుల్లో వదలమని తెలిపియున్నారు.   

ఇళ్ళు దగ్ధం ఐన కుటుంబాలకు ఆర్ధిక సాయం

Image
మోపిదేవి హరనాద్ బాబు రేపల్లె మండలం రావి అనంతరం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక సహాయం అందించిన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య , పశుసంవర్ధక , మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ అయిన మోపిదేవి హరనాద్ బాబు  మరియు వైయస్అర్ కాంగ్రెస్ నాయకులు....

వరదలకు ముందస్తు చర్యలు

లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు  ఉందని ఆదివారం పట్టణం సందర్శించడానికి వచ్చిన  జిల్లా కలెక్టర్, ముందస్తు చర్యగా అప్రమత్తంగా ఉండాలని  అగ్ని మాపక సిబ్బందిని ఆదేశించారు.దాంతోల్లా డి.ఎఫ్ఓ ఆదేస్యాల మేరకు బాపట్ల అగ్ని మాపక కేంద్ర అధికారి యార్లగడ్డ వెంకటేశ్వర రావు, పట్టణ అగ్ని మాపక కేంద్ర అధికారి వీ నారాయణ సిబ్బందిని సిద్దంగా ఉంచారు.రిస్క్ బొట్లు ఆస్క  లైట్లు  లైఫ్ జకెట్ల్టు  సిద్దం చేసారు.పెనుమూడి, చాట్రగడ్డ మైనేనివారిపాలెం కామరాజుగడ్డ మోర్తోట బొబ్బర్లంక రాజుకాలవ లంకేవానిదిబ్బ పిరాట్లంక రాజుల చెరువు రేపల్లె ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు.

నాలుగు పూరిళ్ళు దగ్ధం

Image
రేపల్లె మండలం పెనుముడి పంచాయతీ రావిఅనంతరం గ్రామంలోని పల్లెలో రాత్రి 2 to 3 గం మధ్యలో నాలుగు  పూరిల్లు దగ్దం అయ్యాయీ . ఒక వ్యక్తీ కి  ఒళ్ళు కాలిన సంఘటన చోటుచేసుకుంది. తెనాలి బిక్షాలు,కనపర్తి  వజ్రమ్మ, దారం ఫకీరు లకు చెందిన పూరిల్లుగా గుర్తింపు.ఆ సమయంలో అందరూ మంచి నిద్రలో ఉండటంతో ఇళ్లల్లోని సామానులు తీసుకోలేకపోయామని, అన్ని కాలి బుడిదైనాయని బాధితులు బోరున విలపిస్తున్నారు.తెనాలి బిక్షాలు తన కాలిపోయే ఇంటి వాసాలు లాగి ఆర్పే క్రమంలో మంటలు బిక్షాలు వీపుకి అంటుకొని విపుకాలిందని రేపల్లె ప్రభుత్వ వైద్యశ్యాలకు తీసుకెళ్లగా అక్కడ icu లేనికారణంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని బంధువులు తెలిపారు.గ్యాస్ లీకేజీ వలన మంటలు చెలరేగాయీ అని బాధితులు తెలిపారు అని ఫైర్ సిబ్బంది తెలిపారు.

లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు

Image
కృష్ణ నది తీరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్  రేపల్లె మండలంలోని లోతట్టు ప్రాంతాల కు వరద ముప్పు ఉండవచ్చునేమో అని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పెనుమూడి, ఓలేరు, మొర్తోట పర్యటించారు.సంబంధిత అధికారులకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. నది తీరా ప్రాంతాల వారు, లంక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.లోటట్టు ప్రాంతాలు పర్యవేక్షణ లో ఉండాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు.రేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశం లో పట్టణ తహసీల్దార్, పట్టణ పురపాలక సంఘ కమిషన్, ఎం పీ ఆర్ డీ ఓ పట్టణ సీ ఐ, రురల్ సీ ఐ పాల్గొన్నారు.

సాంస్కృతిక బొమ్మల కొలువు.......నల్లూరు గ్రామంలో

Image
భాగవతాన్ని తలపిస్తున్న బొమ్మలు రేపల్లె మండలం నల్లూరు  గ్రామం లో గాయత్రీ సేవ సమితి  అనాధ ఆశ్రమం  ఆధ్వర్యం లో జగన్మొహనం అను బొమ్మల కొలువు ప్రదర్శన నిర్వహించారు.సంస్కృతి , సంప్రదాయాలు నిలువెత్తు  సాక్ష్యాలుగా రకరకాల బొమ్మలు దర్సనం ఇస్తున్నాయి .గతంలో తెనాలిలో లక్ష బొమ్మల కొలువు ప్రదర్సన చేసారు, మైసూరు, విజయవాడ లో కూడా నిర్వహించారు ఇప్పటి కాలం పిల్లలకు  సంస్కృతి  సంప్రదాయాలు తెలియజేయాలనే దేయంగా ఈ ప్రదర్శన నిర్వహించారు .గతంలో  నిర్వహించిన కొలువులు తాత్కాలికం అని ఇప్పుడు స్థిరంగా ఒక్క చోట మ్యూజియం చేయాలనీ నల్లురులో నిర్వహించడం జరిగింది అని  బొమ్మలకొలువు నిర్వాహకులు చక్రవర్తి తెలిపారు. రామాయణాన్ని  తలపిస్తున్న బొమ్మలు