కోర్రాలతో అద్భుతమైన లాభాలు




  • యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి
  • జీర్ణనాలన్ని శుభ్రం చేస్తుంది
  • శరీర బరువును పెరగనివ్వదు


మన దేశ ప్రజలు కొర్ర బియ్యాన్ని తక్కువగా పండిస్తారు. భారత ప్రజలు కొర్రలను చిరుధాన్యాలుగా పిలుస్తారు.కొర్రలను పండిస్తున్న రైతులు భారతదేశంలో  చాలా తక్కువగా ఉన్నారు. బియ్యాన్ని వండుకొన్నట్టే కొర్రలను కూడా వండుకోవచ్చు.కొర్ర బియ్యం తో కొర్ర అన్నం ,  కొర్ర పులిహోర, కొర్ర కిచిడి, కొర్ర ఉప్మా, కొర్ర అంబలి, కొర్ర రొట్టెలు వంటి వివిధ రకాల వంటలు వండుకొని తినవచ్చు.షుగర్ సమస్య  ఉన్నవారికి కొర్రలు దివ్య ఔషదం అని చెప్పవచ్చు.  ఇవి అధిక శక్తిని అధిక పీచు పదార్ధాన్ని కలిగి ఉంటాయి. కొర్రలలో మాంసకృత్తులు, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం మరియు రెబోఫ్లోమింగ్ అధికంగా ఉంటాయి.ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారికి కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తాయి. కొర్ర బియ్యం జీర్ణనాలన్ని శుభ్రం చేస్తుంది మరియు మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. శరీర బరువును పెరగనివ్వదు. కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.కడుపునొప్పి, ఆకలి లేకపోవటం అజీర్తి వంటి సమస్యలకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే జిగురు పదార్థం కొర్ర బియ్యం లో ఉండదు కనుక ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినటం వలన గుండె జబ్బులు దరి చేరవు. కనుక ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి అని సైంటిస్టులు చెబుతున్నారు. కీళ్లనొప్పులను జ్వరాన్ని  దరిచేరనివ్వవు. కాలిన గాయాలు త్వరగా మానడానికి కొర్రబియ్యం చక్కగా ఉపయోగపడతాయి. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది. కొర్ర బియ్యం లో మాంసకృత్తులు, ఇనుము శాతం ఎక్కువగా ఉండటంవలన రక్తహీనత దరిచేరదు. కొర్రలలో యాంటీఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని బాలింతలు ఎక్కువగా తీసుకోవటం చాలా మంచిది. చిన్నపిల్లలకు గర్భిణీలకు కొర్రలు బలవర్థక ఆహారం. వీటిలో మాంసకృత్తులు ఉండటం వలన పిల్లల ఎదుగుదలకు కూడా చాలా చక్కగా సహాయపడుతుంది.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్