Posts

Showing posts from August 12, 2019

లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు

Image
కృష్ణ నది తీరాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్  రేపల్లె మండలంలోని లోతట్టు ప్రాంతాల కు వరద ముప్పు ఉండవచ్చునేమో అని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ పెనుమూడి, ఓలేరు, మొర్తోట పర్యటించారు.సంబంధిత అధికారులకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. నది తీరా ప్రాంతాల వారు, లంక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.లోటట్టు ప్రాంతాలు పర్యవేక్షణ లో ఉండాలని అధికారులకు ఆదేశాల జారీ చేశారు.రేపల్లె తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశం లో పట్టణ తహసీల్దార్, పట్టణ పురపాలక సంఘ కమిషన్, ఎం పీ ఆర్ డీ ఓ పట్టణ సీ ఐ, రురల్ సీ ఐ పాల్గొన్నారు.

సాంస్కృతిక బొమ్మల కొలువు.......నల్లూరు గ్రామంలో

Image
భాగవతాన్ని తలపిస్తున్న బొమ్మలు రేపల్లె మండలం నల్లూరు  గ్రామం లో గాయత్రీ సేవ సమితి  అనాధ ఆశ్రమం  ఆధ్వర్యం లో జగన్మొహనం అను బొమ్మల కొలువు ప్రదర్శన నిర్వహించారు.సంస్కృతి , సంప్రదాయాలు నిలువెత్తు  సాక్ష్యాలుగా రకరకాల బొమ్మలు దర్సనం ఇస్తున్నాయి .గతంలో తెనాలిలో లక్ష బొమ్మల కొలువు ప్రదర్సన చేసారు, మైసూరు, విజయవాడ లో కూడా నిర్వహించారు ఇప్పటి కాలం పిల్లలకు  సంస్కృతి  సంప్రదాయాలు తెలియజేయాలనే దేయంగా ఈ ప్రదర్శన నిర్వహించారు .గతంలో  నిర్వహించిన కొలువులు తాత్కాలికం అని ఇప్పుడు స్థిరంగా ఒక్క చోట మ్యూజియం చేయాలనీ నల్లురులో నిర్వహించడం జరిగింది అని  బొమ్మలకొలువు నిర్వాహకులు చక్రవర్తి తెలిపారు. రామాయణాన్ని  తలపిస్తున్న బొమ్మలు