Posts

Showing posts from August 13, 2019

బాధితులను పరామర్శించారు

Image
చేరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక సహాయం అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య , పశుసంవర్ధక , మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు   సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ మోపిదేవి హరనాద్ బాబు గారు   వైయస్అర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు"

Image
CITU నేతలు రేపల్లె టౌన్. .సీఐటీయూ ఆగస్ట్ 18 గుంటూరులో జరిగే "కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు" జయప్రదం చేయాలని కోరుతూ రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మిట్ చేస్తామని అధికారంలోకి వచ్చినా అని ప్రభుత్వాలు హామీలు ఇస్తూ వస్తున్నాయి.ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తుదంని ఎన్నో ఆశలతో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.కానీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయకుండా కేవలం ప్రభుత్వం కమిటీ వేసి కాలయాపన చేస్తున్నది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న విద్య,వైద్యం,ఆర్టిసి,అగ్రికల్చర్,డేటా ఆపరేటర్లు,విద్యుత్ తదితర కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులును పర్మినెట్ చేయాలని మరియు  సచివాలయం ఉద్యోగాల భర్తీలో గతంనుండి పనిచేస్తున్నా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 18న గుంటూరులో జరిగే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్య

ఇసుక క్వారీ లను తెరిపించాలి

Image
రేపల్లె నియోజక వర్గం భవన నిర్మాణ కార్మికుల సంఘం AITUC ఆధ్వర్యంలో పెనుముడి, ఓలేరు ,జువ్వాలపాలెము, మరియు రాష్ట్ర వ్యాపితం గా ఉన్న ఇసుక క్వారీ లను తెరిపించి కార్మికులకు ఉపాధి చూపించాలని పట్టణ వీధులలో భారీ ప్రదర్శన నిర్వహించి MRO గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AITUC రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ.వెలుగూరి రాధాకృష్ణ మూర్తి గారు ధర్నా ను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ఈ నెల 25,26 తేదీల లో విజయవాడలో జాతీయ సెమినార్ లో దేశవ్యాప్తం గా ఇసుక పాలసి ని రూపొందిచాలని,భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘ పరిరక్షణ, కార్మికుల భద్రత గురించి చర్చించడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి P..సత్యనారాయణ,AITUC జిల్లా అధ్యక్షుడు P. నాగాజనేయులు,ఏరియా కార్యదర్శి.K.రమేష్, G. శివయ్య, శ్రీనివాసరావు,P. వెంకటేశ్వరరావు, పఠాన్ గౌస్,Cpi ఏరియా కార్యదర్శి G. బాలజీ,శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ D. ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

పందులను వీధుల్లో వదలరాదు

Image
కమీషనర్  బి విజయ సారధి రేపల్లె పట్టణం లోని పందుల పెంపకదారులతో కమీషనర్  బి విజయ సారధి ఛాంబర్ నందు జరిగిన సమావేశంలో పందులను పట్టణ విధులలో వదలకుండ వుండవలనని తెలియచేయగా పెంపకదారులు అది మా జీవన ఆధారం కావున మాకు పందులను పెంచుకొనుటకు ప్రదేశము ఏర్పాటు చేయవలసిందిగా కోరగా కమీషనర్ గారు త్వరలో వారి సమస్యలను పరిష్కరంచే చర్యలు తీసికొనబడునని తెలియచేయగా పందుల పెంపకదారులు రేపటి నుండి పుర విధుల్లో వదలమని తెలిపియున్నారు.   

ఇళ్ళు దగ్ధం ఐన కుటుంబాలకు ఆర్ధిక సాయం

Image
మోపిదేవి హరనాద్ బాబు రేపల్లె మండలం రావి అనంతరం గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన బాధితులను పరామర్శించి , వారికి ఆర్ధిక సహాయం అందించిన , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్య , పశుసంవర్ధక , మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు సోదరులు , నిజాంపట్నం గ్రామ సర్పంచ్ అయిన మోపిదేవి హరనాద్ బాబు  మరియు వైయస్అర్ కాంగ్రెస్ నాయకులు....

వరదలకు ముందస్తు చర్యలు

లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు  ఉందని ఆదివారం పట్టణం సందర్శించడానికి వచ్చిన  జిల్లా కలెక్టర్, ముందస్తు చర్యగా అప్రమత్తంగా ఉండాలని  అగ్ని మాపక సిబ్బందిని ఆదేశించారు.దాంతోల్లా డి.ఎఫ్ఓ ఆదేస్యాల మేరకు బాపట్ల అగ్ని మాపక కేంద్ర అధికారి యార్లగడ్డ వెంకటేశ్వర రావు, పట్టణ అగ్ని మాపక కేంద్ర అధికారి వీ నారాయణ సిబ్బందిని సిద్దంగా ఉంచారు.రిస్క్ బొట్లు ఆస్క  లైట్లు  లైఫ్ జకెట్ల్టు  సిద్దం చేసారు.పెనుమూడి, చాట్రగడ్డ మైనేనివారిపాలెం కామరాజుగడ్డ మోర్తోట బొబ్బర్లంక రాజుకాలవ లంకేవానిదిబ్బ పిరాట్లంక రాజుల చెరువు రేపల్లె ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు.

నాలుగు పూరిళ్ళు దగ్ధం

Image
రేపల్లె మండలం పెనుముడి పంచాయతీ రావిఅనంతరం గ్రామంలోని పల్లెలో రాత్రి 2 to 3 గం మధ్యలో నాలుగు  పూరిల్లు దగ్దం అయ్యాయీ . ఒక వ్యక్తీ కి  ఒళ్ళు కాలిన సంఘటన చోటుచేసుకుంది. తెనాలి బిక్షాలు,కనపర్తి  వజ్రమ్మ, దారం ఫకీరు లకు చెందిన పూరిల్లుగా గుర్తింపు.ఆ సమయంలో అందరూ మంచి నిద్రలో ఉండటంతో ఇళ్లల్లోని సామానులు తీసుకోలేకపోయామని, అన్ని కాలి బుడిదైనాయని బాధితులు బోరున విలపిస్తున్నారు.తెనాలి బిక్షాలు తన కాలిపోయే ఇంటి వాసాలు లాగి ఆర్పే క్రమంలో మంటలు బిక్షాలు వీపుకి అంటుకొని విపుకాలిందని రేపల్లె ప్రభుత్వ వైద్యశ్యాలకు తీసుకెళ్లగా అక్కడ icu లేనికారణంగా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని బంధువులు తెలిపారు.గ్యాస్ లీకేజీ వలన మంటలు చెలరేగాయీ అని బాధితులు తెలిపారు అని ఫైర్ సిబ్బంది తెలిపారు.