కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు"

CITU నేతలు
రేపల్లె టౌన్..సీఐటీయూ ఆగస్ట్ 18 గుంటూరులో జరిగే "కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర సదస్సు" జయప్రదం చేయాలని కోరుతూ రేపల్లె సీఐటీయూ కార్యాలయంలో పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పర్మిట్ చేస్తామని అధికారంలోకి వచ్చినా అని ప్రభుత్వాలు హామీలు ఇస్తూ వస్తున్నాయి.ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తమను పర్మినెంట్ చేస్తుదంని ఎన్నో ఆశలతో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.కానీ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేయకుండా కేవలం ప్రభుత్వం కమిటీ వేసి కాలయాపన చేస్తున్నది.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న విద్య,వైద్యం,ఆర్టిసి,అగ్రికల్చర్,డేటా ఆపరేటర్లు,విద్యుత్ తదితర కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులును పర్మినెట్ చేయాలని మరియు  సచివాలయం ఉద్యోగాల భర్తీలో గతంనుండి పనిచేస్తున్నా వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఆగస్టు 18న గుంటూరులో జరిగే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులా రాష్ట్ర సదస్సుకు రేపల్లె నియోజకవర్గం పరిధిలోని రేపల్లె,నిజాంపట్నం,నగరం,చేరుకుపల్లి మండలాల పరిధిలోని కాంట్రాక్టు  ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు.వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులా రేపల్లె డివిజన్ కన్వీనర్ కె.శ్రీనివాసు,ఎం.గోపి,ఆర్.శ్రీనివాసరావు,జె.ధర్మ రాజు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్