Posts

Showing posts from August 19, 2019

ఆర్ ఆర్ ఆర్ కి నేషనల్ మార్కెట్ లో పోటీ

Image
2020 జూలై 30 రిలీజ్ డేట్ ఏడాది ముందే బుక్ చేసుకున్న  క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా బాలీవుడ్ నిర్మాతలు ఒక్కొక్కరుగా వాళ్ళ సినిమాలను  ఒక రోజు అటుఇటుగా విడుదల చేసుకునేందుకు సన్నాహలు చేసుకుంటున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా రోహిత్ శెట్టి రూపొందిస్తున్న పోలీసు కథ సూర్యవంశీ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి జులై 30నే విడుదల తేది ఖరారు చేశారు. అదే రోజు సల్మాన్ ఖాన్ దబాంగ్ 3, ఇన్షఅల్లా  రావొచ్చని ముంబై రిపోర్ట్స్ ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ కు నేషనల్ మార్కెట్ లో హిందీ సినిమాలతో భారీ పోటీ తప్పేలా లేదు. షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నా రాజమౌళి మాత్రం డేట్ విషయంలో ఎలాంటి మార్పు చేయడం లేదు. అక్కడ చూస్తేనేమో ఒకరిని మించి మరొకరు అదే తేదీ కోసం పోటీ పడుతున్నారు. ఇదే పరిస్థితి ఆగస్ట్ 15 అనుకున్నప్పుడు సాహోకు వచ్చింది. .

ఇళ్ల స్థలాలు కోసం ధర్నా...

Image
  చేరుకుపల్లి ..ఇళ్ల స్థలాలు కోసం ధర్నా...వ్యవసాయ కార్మిక సంఘము మరియు సీపీఎం ఆధ్వర్యంలో చేరుకపల్లి తహసీల్దార్ కార్యాలయ వద్ద ధర్నా నిర్వహించి,తహసీల్దార్ శ్రీదేవి గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ ధర్నాలో సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు అనేక మంది ఇళ్లస్థలాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇస్తాముంటున్నారు కానీ ఇప్పటికే ప్రభుత్వ స్థలలో ఇళ్ళు వేసుకొని ఉంటున్నావారికి పట్టాలు ఇవ్వాలి.మరియు చేరుకుపల్లి మండలం పరిధిలో జాతీయ రహదారి నిర్మాణం పరిధిలో ఇళ్ళు కోల్పోయిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి అన్నారు.మరియు రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కార్మికులులకి రాష్ట్రంలో మిగులు భూములు ఉన్నప్పటికీ సాగుభూములు  ఇవ్వటం లేదు కనీసం ఇళ్ల స్థలాలు అయనా రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ కార్మికుడుకి ఇవ్వాలని అన్నారు.ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కమిటీ సభ్యులు విష్ణువర్ధనరెడ్డి,సీపీఎం చేరుకుపల్లి మండల కార్యదర్శి కె.శరత్, మహిళ సంఘము ఐద్వా రేపల్లె డివిజన్ అధ్యక్షురాలు పి.వీణదేవి,సీపీఎం నాయకులు వి.మావో మరియు మ