ఇళ్ల స్థలాలు కోసం ధర్నా...

 చేరుకుపల్లి..ఇళ్ల స్థలాలు కోసం ధర్నా...వ్యవసాయ కార్మిక సంఘము మరియు సీపీఎం ఆధ్వర్యంలో చేరుకపల్లి తహసీల్దార్ కార్యాలయ వద్ద ధర్నా నిర్వహించి,తహసీల్దార్ శ్రీదేవి గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ఈ ధర్నాలో సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు అనేక మంది ఇళ్లస్థలాలు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇస్తాముంటున్నారు కానీ ఇప్పటికే ప్రభుత్వ స్థలలో ఇళ్ళు వేసుకొని ఉంటున్నావారికి పట్టాలు ఇవ్వాలి.మరియు చేరుకుపల్లి మండలం పరిధిలో జాతీయ రహదారి నిర్మాణం పరిధిలో ఇళ్ళు కోల్పోయిన వారికి వెంటనే స్థలాలు ఇవ్వాలి అన్నారు.మరియు రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కార్మికులులకి రాష్ట్రంలో మిగులు భూములు ఉన్నప్పటికీ సాగుభూములు  ఇవ్వటం లేదు కనీసం ఇళ్ల స్థలాలు అయనా రాష్ట్రంలో ప్రతి వ్యవసాయ కార్మికుడుకి ఇవ్వాలని అన్నారు.ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కమిటీ సభ్యులు విష్ణువర్ధనరెడ్డి,సీపీఎం చేరుకుపల్లి మండల కార్యదర్శి కె.శరత్, మహిళ సంఘము ఐద్వా రేపల్లె డివిజన్ అధ్యక్షురాలు పి.వీణదేవి,సీపీఎం నాయకులు వి.మావో మరియు మండలం పరిధిలోని వివిధ గ్రామాల  ప్రజలు,వ్యవస్యకార్మికలు ఆర్జీలతో పాల్గొన్నారు.   

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్