భారత విద్యార్థి ఫెడరేషన్ SFI



స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల
జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కొనసాగించాలని
సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని

ఆగస్టు 21 ఛలో కలెక్టరేట్

విద్యార్థులు కదలిరండి!

  ఛలో కలెక్టరేట్ జయప్రదం కొరకు స్థానిక ABR ప్రభుత్వ కాలేజ్ ఆవరణలో SFI నాయకులు ఛలో కలెక్టరేట్ పోస్టర్ ను ఆవిష్కరించారు  ఈ సందర్భంగా SFI డివిజన్ కార్యదర్శి బి.ఆర్య మాట్లాడుతూ..

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు గడిచిపోయింది.గత ప్రభుత్వం
నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల సమస్యల మధ్య విద్యా సంవత్సరం ప్రారంభం అయింది.
విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వాటిపై అధికారులకు మంత్రులకు,
mla లకు , వినతి పత్రాలు అందించాము   ధర్నాలు నిర్వహించాము . అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదు.
అందువల్ల  రేపల్లె నియోజకవర్గ పరిధిలోని  విద్యార్థులు సమస్య పరిష్కారం కోసం ఈనెల
21వ తేదీన గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం
జరుగుతుంది. దీనికి విద్యార్థిని,విద్యార్థులు తరలిరావాలి మన సమస్యలు
పరిష్కారం కోసం జరిగే ధర్నా లో పాల్గొనాలని కోరుతున్నాము.
| దేశం, రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే విద్యారంగం కీలకం. కానీ మన పాలకులు
నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ విద్య కునారిల్లు తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వంలధికారంలోకి
వచ్చిన ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి మేం కట్టుబడి ఉన్నాం అంటున్నారు
కానీ ఆచరణలో అమలు చేయడం లేదు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం లోని
  స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్
విడుదల చేయకుండా కాలయాపన చేసింది. ఎస్టీ, బీసీ హాస్టల్ విద్యార్థులకు  7
నెలల క్రాసిటిక్, మెన్ చార్జీలను విడుదల చెయ్యకుండా తాతారం చేసింది. గత
ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేయవలసిన నూతన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు
-ఇవ్వవలసిన స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్సుమెంట్ ,  మెస్ చార్జీలను
విడుదల చేయకుండా , విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను గుర్తించకుండా
సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదు.
అర్ధాకలి లో జూనియర్ కళాశాల విద్యార్థుల చదువులు
నూతన ప్రభుత్వం ఏర్పడగానే విద్యార్థులకు అమ్మఒడి అని ఆశ చూపింది
జూనియర్ కళాశాల విద్యార్థుల కడుపు నింపుకునే మధ్యాహ్న భోజనం తీసివేయడం దారుణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యలు పతిష్కరించకుంటే విద్యాసంస్థల బంద్  చేస్తాం అని హెచ్చరించారూ  కావున కలెక్టరేట్ దగ్గర జరిగే ధర్నాలో వేలాది గా విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని SFI పిలుపుణిస్తుంది

ఈ కార్యక్రమంలో SFI నాయకులు జెస్సి, కోటేశ్వరరావు, నవీన్, హేమ శ్రీ,శివాని, బాల జ్యోతి, భావాని పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్