ఆర్టికల్ 370,35ఏ రద్దు పై చర్చగోష్ఠి

చర్చగోష్ఠిలో ప్రసంగిస్తున్న నేతలు 
పట్టణంలో...జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370,35ఏ రద్దు అంశంపై  సీతారామయ్య కల్యాణ మండపంలో జరిగింది.ఓపిడీఆర్(ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ)ఆధ్వర్యంలో ఓపిడీఆర్ నాయకులు నాగరాజు గారు అధ్యక్షతన జరిగింది.ఈ చర్చ గోష్ఠిలో తెలంగాణ,ఆంధ్ర రాష్ట్రల ఓపిడీఆర్ ప్రధాన కార్యదర్శి వి.హనుమంతురావు గారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై నిరంకుశమంగా బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుంది.జమ్మూకాశ్మీర్ కి ప్రత్యేక హక్కులు కల్పించే  స్వయంప్రతిప్తతిని రద్దు చేస్తు  ఉగ్రవాదని నిర్ములిస్తాము,జమ్మూకాశ్మీర్ అభివృద్ధికి 370 ఆర్టికల్ ఆటంకంగా ఉందని ప్రచారం చేస్తున్నారు.కానీ దానిలో వాస్తవం లేదు 1947  స్వాతంత్ర్య అనతరం నుండి 370 అమలు జరుగుతుంది కానీ నేడు ఈ 370 ఆర్టికల్ రద్దుచేస్తు కాశ్మీర్ ని భారత దేశంలో విలీనం చేశాము అభిరుద్ది చేస్తాము అనటం ప్రజలను తప్పుదోవ పట్టించటమే అని వామపక్ష శక్తులు అభ్యదయ శక్తులుగా,ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపిడీఆర్ ఖండిస్తున్నాము అని అన్నారు.వాస్తవానికి హిందూత్వ ఏజండాతో లోకిక భారత దేశంలో హక్కులు పై దాడి మరియు జమ్మూకాశ్మీర్ లోకి కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు తీసుకువెళ్ళటానికి అక్కడా వ్యాపారం సుగమం చేసుకోవటానికి ఉగ్రవాదం పేరుతో ముస్లింలు పై దాడి చేయటానికి బీజేపీ అడగొలుగా చట్టసభల్లో నిరంకుశగా 370 రద్దు చేయటం అంటే భవిష్యత్తులో  దేశంలో అని రాష్ట్రంలో ప్రజలు హక్కులు పై దాడి చేయటమే అన్నారు.ఈ సమావేశంలో సీపీఎం నేత సిహెచ్. మణిలాల్, సీపీఐ(ఎంల్)నేత ఎం.శోభారాణి,న్యాయవాది ఎం.సుబ్బయ్య మధ్యతరగతి ఉద్యోగులు ఎం.రాజరత్నం,సోషలిజం వివిధ ప్రజసంఘలు నేతలు బి.ఈశ్వరరావు,బి. ఆర్య, సురేష్ ,వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

ఇసుక క్వారీ లను తెరిపించాలి

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్