Posts

Skar1news

యుద్ద విమాన తేజస్ లో రామనాథ్

Image
యుద్ధ విమానం తేజాస్‌లో రక్షణ మంత్రి   రాజ్‌నాథ్‌ సింగ్‌   గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో పైలట్‌ వెనుక సీటులో కూర్చున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ హెల్మెట్‌ ధరించి, ఆక్సిజన్‌ మాస్క్‌తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్‌లోని హాల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్‌ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్‌లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా  ఉన్నానని రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. తేజాస్‌ యుద్ధ విమానంలో పర్యటించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌ పేరిట రికార్డ్‌ నమోదైంది.పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో విహారం ఆస్వాదించానని, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్‌ కొనుగోలుకు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. కాగా ఈ ఏడాది జనవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సుఖోయ్‌ 30 యుద్ధ విమానంలో జోథ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేఫన్‌ సుంచి 45 నిమిషాల పాటు ప్రయాణించారు.

ఆ విషయంలో మనోళ్లే ముందు

Image
దేశం వలసబాట పడుతోంది. బతుకుదెరువుకోసమో, చదువుకోసమో, ఉపాధి కోసమో కారణమేదైనా కావచ్చు ప్రపంచ దేశాలతో పోలిస్తే అత్యధిక మంది భారతీయులు వివిధ దేశాల్లో వలసలుగా జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 27.2 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస జీవనం సాగిస్తోంటే, ఒక్క భారత దేశంలోనే అత్యధికంగా 1.75 కోట్ల మంది ప్రజలు ప్రవాసజీవితాన్ని గడుపుతున్నారని ఈ నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ జనాభా విభాగం విడుదల చేసిన ఇంటర్నేషనల్‌ మైగ్రెంట్‌ స్టాక్‌ 2019 వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ప్రాంతాల వారీగా, స్త్రీ పురుషుల, వయసునుబట్టి వలసబాటపట్టిన వారి వివరాలను ఈ రిపోర్టు వెల్లడించింది. అంతర్జాతీయంగా అత్యధికమంది వలసబాటపట్టిన టాప్‌ టెన్‌ దేశాల్లోనే మూడొంతుల మంది ప్రవాసులు ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేశాయి. 1.75 కోట్లమంది మన దేశ ప్రజలు వివిధ దేశాల్లో వలసజీవితం సాగిస్తోన్న వారిలో అగ్రభాగాన ఉంటే మెక్సికో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ♦  2015లో భారత దేశం వివిధ దేశాల నుంచి వచ్చి

భారీ పెనాల్టీల పై నిరసన

Image
రేపల్లె :ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు వడ్డిస్తూ మోటార్‌ వాహన చట్టంలో చేపట్టిన సవరణలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో పలు ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు గురువారం సమ్మెకు పిలుపుఇచ్చాయి. రవాణా సమ్మెతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌ల సేవలు నిలిచిపోవడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ట్రక్కులు, బస్‌లు, ఆటోలు, టెంపోలు, మ్యాక్సి క్యాబ్స్‌ సహా అన్ని వాహనాలకు సంబంధించిన 41 సంస్థలు, సంఘాలతో కూడిన రవాణా సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌టీఏ) సమ్మెకు పిలుపు ఇచ్చింది. మోటార్‌ వాహన చట్టానికి చేసిన సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని, ప్రైవేట్‌ వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి.

సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి

Image
  రేపల్లె మండలం. సీపీఎం నేత కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ సిపిఎం రేపల్లె డివిజన్ కమిటీ సభ్యులు కె. శరత్ అధ్యక్షతన జరిగింది.కామ్రేడ్ దివి.సాయిబాబు 13 వ వర్ధతి సభ ప్రారంభంలో దివి.సాయిబాబు చిత్రపటానికి సీపీఎం సీనియర్ నాయకులు ఏవిపికె.సుబ్రమణ్యం పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్.మణిలాల్ మాట్లాడుతూ కామ్రేడ్ దివి. సాయిబాబు రేపల్లె ప్రాతంలో కార్మిక,వ్యవసాయకార్మిక,రైతు,చేనేత కార్మికులు ఉద్యమాల్లో పనిచేసినా వ్యక్తి అన్నారు.అనేక ప్రజా సమస్యలపై ప్రజల్లో పనిచేసినా ఉద్యమా నేత అన్నారు.సాయి బాబు ఆనారోగ్యం ఉన్నపటికీ ప్రజల్లో ఉండి చివరి వరకు ఎర్రజండాని విడవని ఆదర్శప్రాయడు,సాయిబాబు గారు చిన్న వయసులో ఆకాలంగా చనిపోవటం రేపల్లె ప్రాంత  ఉద్యమాన్నికి లోటు అన్నారు.నేడు దేశంలో బీజేపీ పెద్ద ఎత్తున కార్పోరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ కష్టజీవులుకి నష్టం కలిగించే విధనాలును ముందుకు తెస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం కూడా హోదా లాంటి విషయాలు పక్కనపెట్టి ఉన్న ఉద్యోగాలు తీసివేస్తూ కొత్త ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకొంటున్నారు,రాబోయే కాలంలో ఐక్య పోరాటాలు కేంద్ర,ర

అహమదీయఎడ్యుకేషనల్ అకాడమి

Image
డైరెక్ట్ గా 10 వ తరగతి ఓపెన్ స్కూల్ ద్వారా సర్టిఫికేట్ పొందవచ్చును 2 సంవత్సరముల ఇన్టర్మేడియేట్ సర్టిఫికేట్ 1 సంవత్సరం లో పొందవచ్చును  I T I  రెగ్యులర్ కోర్సు  కలదు . T T C , B E D, H P T   , ట్రైనింగ్ కోర్సులకు సంప్రదించవలెను . ప్రతి సంవత్సరము నాగార్జున  యూనివర్సిటి   మరియు ఆంద్ర  యూనివర్సిటి      U G, P G కోర్సులు కలవు . ఇతర రాష్ట్రాల సర్టిఫికే్ట్స్ టెక్నికల్, డిప్లమా కోర్సులు, రెగ్యులర్  ఆల్ బ్రాంచెస్  హిమాలయన్ యూనివర్సిటి సన్ రైజ్ యూనివర్సిటి మేవార్ యూనివర్సిటి I E C యూనివర్సిటి విలియమ్ క్యారి యూనివర్సిటి N E F T యూనివర్సిటి పాస్ గ్యారెంటి 8297449394

వంట సామాగ్రిని వరద బాధితులకు అందించిన అనగాని

Image
గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుమూడి గ్రామంలో వరద బాధితులను పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు,వంట సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు అనగాని మాట్లాడుతూ రాజకీయ లబ్దిపొందాలని కక్షతో వరద చుట్టూతా చూపించి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వరద ముంపు తేవాలని చూశారు ఈ వరద మనిషి క్రియేటెడ్ వరదని అన్నారు ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం తెలియని ఇరిగేషన్ మంత్రి యొక్క  పర్యవేక్షణలో పై నుండి వరద ప్రాపర్ అంచనా వేయలేక కిందకి ఎప్పుడెప్పుడు విడతలవారీగా వధలాలో అది కూడా తెలియకుండా పరివేక్షించకుండా ఉండడం వల్లనే ఈ వరద రావడం జరిగింది చంద్రబాబు గారి ఇల్లు కుల కొట్టడం కోసం దురాలోచనతో వరద క్రియేట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీటిని ఆపటం చాలా దుర్మార్గ చర్య ఈ రాష్ట్రంలో వరదలు వచ్చి గ్రామాలన్నీ ముంపు గురవుతుంటే వేల ఎకరాలు పంట నష్టం జరుగుతుంది కుటుంబంతో ముఖ్యమంత్రి గారు అమెరికా విహారయాత్ర వెళ్లడం చాలా బాధాకరం అనిపిస్తుంది గతంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్ని వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పర్యవేక్షించి ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అప్రమత్తం చేశారు కృష్ణా నదిలో

అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల

Image
అసెంబ్లీ కంప్యూటర్లు, ఫర్నీచర్ దొంగిలించిన కోడెల. హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీని అమరావతికి తరలించే సమయంలో హైదరాబాద్‌లో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను లారీల్లో తరలించారు. ఆసమయంలో కొన్ని లారీలను నేరుగా అప్పటి స్పీకర్ కోడెల తన ఇంటికి మళ్లించారు. గుంటూరు, సత్తెనపల్లిలోని తన నివాసంలో కంప్యూటర్లు, విలువైన ఫర్నిచర్‌ ఉంచుకున్నారు.ప్రభుత్వం మారినా సరే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కోడెల మౌనంగా ఉంటూ వచ్చారు.ఇటీవల అసెంబ్లీ అధికారులు హైదరాబాద్‌ నుంచి వచ్చిన కంప్యూటర్లు, ఫర్నిచర్‌ గురించి పరిశీలన చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.తరలింపు సమయంలో స్పీకర్ కోడెల నేరుగా తన ఇంటికి లారీలను మళ్లించారని కొందరు ఉప్పందించారు. తొలుత ఈ విషయంపై అసెంబ్లీ సెక్రటరీ లేఖ రాసినా కోడెల స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు.దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి పరిశీలించగా ఫర్నిచర్, కంప్యూటర్లు ఉన్నట్టు తేలింది. దాంతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.